విదేశాల నుంచి గొలుగొండకు ముగ్గురు యువకులు

యువకునికి నోటీసు జారీ చేస్తున్న వైద్యాధికారి ధనలక్ష్మీ గొలుగొండ, న్యూస్ లీడర్: కరోనా వైరస్ ప్రపం చాన్ని వణికిస్తున్న నేపధ్యంలో పలు దేశాల నుంచి గొలుగొండ మండలంలోని స్వగ్రామా లకు తరలివచ్చిన ముగ్గురు వ్యక్తులను వారి ఇళ్ల వద్దే ఐస్ లేషన్లో ఉంచినట్లు గొలుగొండ వైద్యాధికారిణి ధనలక్ష్మీ తెలిపారు. మండలం లోని పాకలపాడు గ్రామానికి చెందిన మందల గంగాధర్ సాగర్(25) మంగళవారం రాత్రి అబు దబి దేశం నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అయితే విషయాన్ని స్థానిక వీఆర్వో ముగ్గురు రామకృష్ణ మండల అధికారులకు తెలియజేయ డం జరిగింది. ఈ మేరకు స్థానిక తహశీల్దార్ వెంకటేశ్వరరావు, ఎస్సై నారాయణరావుల ఆధ్వర్యంలో వైద్యా ధికారులు గ్రామాలకు వెళ్లి వీరికి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఐస్ లేషన్లో , ఉంచినట్లుగా వైద్యాధికారి తెలిపారు. ఇతనితో పాటు ఇదే మండలం లింగంపేట గ్రామానికి చెందిన పరవాడ ప్రసాద్(31) మలేషియా నుంచి ఫిబ్రవరి 23వ తేదీన స్వగ్రామానికి వచ్చాడని అతన్ని కూడా వైద్య పరీక్షలు నిర్వ హించి ఐస్ లేషన్ లో ఉంచామన్నారు. ఇతను 26 రోజులు గడిచిందని, అయితే కరోనా .