తెలుగు భాషకు విదేశీ గడ్డపై అరుదైన గౌరవం
తెలుగులో పురాతన గ్రంథాలైన పంచతంత్ర, భాస్కర శతకం నుంచి తెలుగు భాషా వైభవం, కవితా సంకలనాలు తదితర పుస్తకాలు ఇక నుంచి బ్రిటిష్ లైబ్రరీలో దర్శనమిస్తాయి. బ్రిటిష్ లైబ్రరీలో తెలుగు గ్రంథాలు కొలువుదీరాయి.తెలుగు భాషకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన బ్రిటిష్ లైబ్రరీ (యూకే జాతీయ లైబ్రరీ) లో తెలుగు పుస్తకాలు, గ్రంథాలు కొలువుదీరాయి. భారతీయ ప్రాంతీయ భాషలకు ప్రోత్సాహం కల్పించేందుకు నవసమాజ్ దర్పణ్ అనే సంస్థ తెలుగు గ్రంథాలను బ్రిటిష్ లైబ్రరీకి బహూకరించింది. యూకేలోనూ భారతీయ భాషల వ్యాప్తికి ప్రోత్సాహమందించేందుకు స్వచ్ఛందంగా తెలుగు పుస్తకాలను అందజేసినట్లు నవసమాజ్ దర్పణ్ ప్రతినిధులు తెలిపారు.సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నవసమాజ్ దర్పణ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ పంజల, డైరెక్టర్ కారం శ్రీనివాస్, సభ్యులు మద్దూరి శ్రీకాంత్, అనిల్, శ్రీనివాస్ తదితరులు బ్రిటిష్ లైబ్రరీ ప్రతినిధులను కలిసి పుస్తకాలు బహూకరించారు. బ్రిటిష్ లైబ్రరీలో సౌత్ ఇండియన్ కలెక్షన్స్ క్యురేటర్ ఆరణి, సభ్యురాలు గోపికను కలిసి తెలుగు గ్రంథాలు అందజేశారు. బ్రిటిష్ లైబ్రరీకి తెలుగు పుస్తకాలు అందజేయడం సంతోషంగా ఉందని.. అందుకు సహకరించిన లైబ్రరీ ప్రతినిధులకు శ్రీకాంత్ అభినందనలు తెలియజేశారు.బ్రిటిష్ లైబ్రరీ వెబ్‌సైట్‌లో తెలుగు పుస్తకాలు.. వాటి రచయితలు.. పబ్లిషర్స్ పేర్లతో సహా దర్శమిస్తాయని నవసమాజ్ దర్పణ్ ప్రతినిధులు తెలిపారు. పురాతన గ్రంథాలైన పంచతంత్ర, భాస్కర శతకం నుంచి తెలుగు భాషా వైభవం, కవితా సంకలనాలు తదితర పుస్తకాలు ఇక నుంచి బ్రిటిష్ లైబ్రరీలో దర్శనమిస్తాయి. రిటైర్ట్ ఐఏఎస్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి హైదరాబాద్‌లో పుస్తకాలను సమకూర్చారని నవసమాజ్ ప్రతినిధులు తెలిపారు.
Popular posts
అమరావతిపై అవంతి సవాల్.. ఆ నలుగురు రాజీనామా చేస్తారా?
• BETHA SRINIVASA RAO
YS Jagan సర్కార్ గుడ్ న్యూస్.. వారికి ఆ సర్టిఫికెట్ లేకుండానే రూ. 75 వేలు..
• BETHA SRINIVASA RAO
మరోసారి చంద్రబాబు దీక్ష.. భౌతిక దూరం పాటిస్తూ నిరసన
• BETHA SRINIVASA RAO
సమస్యలు పై స్పందించిన కమిషనర్
• BETHA SRINIVASA RAO
జర్నలిస్టుల పిల్లలకు ఉపకారవేతనాలు ఆగస్టు నెలాఖరు లోగా దరఖాస్తులు అందజేయండి మీడియా అవార్డుల ప్రధానోత్సవం కి ఏర్పాట్లు త్వరలో ఆధార్ మేళా నిర్వహణకు సన్నాహాలు
• BETHA SRINIVASA RAO
Publisher Information
Contact
greatervaartha@gmail.com
8897638881
13-304 SECTOR 2, AMBEDAKAR NAGAR, ARILOVA
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn