అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండే.. అంత ఈజీగా మర్చిపోయే పేరు కాదిది. తెలుగు ప్రేక్షకులకు కొత్త రకం ముద్దుల లోకం చూపించి మైమరిపించింది ఈ ముద్దుగుమ్మ. చిన్నతనం నుంచే హీరోయిన్ కావాలనే ఆశతో పెరిగిన షాలినీ పాండే 'అర్జున్ రెడ్డి' అనే తెలుగు మూవీతో సినీ గడప తొక్కింది. అయితే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె పెట్టిన ఓ పోస్ట్ నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఏంటా పోస్ట్? అందులో ఏముంది? వివరాల్లోకి పోతే..అమ్మడికి ఛాన్సులే ఛాన్సులు అనుకున్నాం.. కానీ షాలినీకి తొలి సినిమా 'అర్జున్ రెడ్డి' సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. దీంతో అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతాయని ఉహించారంతా. కానీ అనుకున్న రేంజ్‌లో ఛాన్సెస్ పట్టలేక పోయింది. దీంతో ఈమె కెరీర్ ఇక ముగిసినట్లే అనుకున్న ఈ సమయంలో బడా స్టార్ హీరోతో నటించే బంపర్ ఆఫర్ పట్టేసింది ఈ బ్యూటీ.ఆ హీరోతో రొమాన్స్ చేయడం చూసి.. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండతో ఆమె పండించిన రొమాన్స్ చూసి టాలీవుడ్ సహా ఇతర భాషా దర్శకనిర్మాతల చూపు షాలినీపై పడింది. ఆ తర్వాత తెలుగులో ''మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, 118'' లాంటి పలు సినిమాల్లో నటించినప్పటికీ అమ్మడికి ఆశించిన ఫలితం మాత్రం రాలేదు.
ఫోకస్ అంతా దానిమీదే.. చివరకు దక్కించుకుంది దీంతో తన ఫోకస్ అంతా బాలీవుడ్ మీదే పెట్టింది షాలినీ పాండే. అక్కడ ఓ సినిమా చేయాలన్న పట్టుదలతో చాలా ప్రయత్నాలు చేసి, చివరికి అక్కడ ఓ అవకాశం పొందగలిగింది. బాలీవుడ్ క్రేజీ స్టార్ రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా ఆమె ఛాన్స్ పట్టేసింది. 'జయేశ్‌భాయ్ జోర్దార్' అనే పేరుతో రాబోతున్న కొత్త సినిమాలో షాలినీ పాండేని ఫైనల్ చేసేశారట.
కోరిక తీరింది.. హద్దుల్లేని ఆనందం దీంతో షాలినీ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన కోరిక ఇన్ని రోజులకు తీరిందంటూ సోషల్ పోస్టు పెట్టింది. ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులు.. కోరిక తీర్చుకోవడమే కాదు, బాలీవుడ్ హీరోలకు బెటర్ ఛాయిస్ నువ్వే కావాలంటూ రియాక్ట్ అవుతున్నారు.
కోరిక తీరిందంటున్న షాలినీ పాండే.. ఆ విషయమై అందరిముందు ఓపెన్ అయిన హాట్ బ్యూటీ