SBI గుడ్‌న్యూస్: ఫోన్ చేస్తే ఇంటికే డబ్బులు, ఇవి తెలుసుకోండి.కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో దేశమంతా స్తంభించిపోయింది. అత్యవసరాల కోసం తప్పితే ప్రజలు బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ ఉంటుంది. ఆ తర్వాత ఎత్తివేసినప్పటికీ ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసే అవకాశముంది.
SBI ఇంటికే డబ్బులు ఇప్పుడు ఏటీఎంలో డబ్బులు లేకపోవడం, బ్యాంకులు తెరిచి ఉండకపోవడం జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్లకు ఇబ్బందులు రాకుండా ఎస్బీఐ ఓ నిర్ణయం తీసుకుంది. అదే డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం. నగదు అత్యవసరమైతే డబ్బును పంపిణీ చేసేందుకు బ్యాంకులే మీ ఇంటికి వస్తాయి. నగదును ఇంటికి తెచ్చి ఇచ్చే వెసులుబాటును కల్పిస్తుంది.
ఎంపిక చేసిన బ్రాంచీల్లో.. ప్రస్తుతం ఈ నగదు డోర్ డెలివరీ సౌకర్యం సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఉంది. ఎస్బీఐ అకౌంట్ హోల్డర్స్ ఈ సౌకర్యాన్ని ఎంపిక చేసిన బ్రాంచీలలో మాత్రమే ప్రస్తుతం పొందగలరు.