జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆయన పదవీ కాలం ఏడాది పొడిగింపు.... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శాసనమండలి రద్దు, కీలక బిల్లులు అసెంబ్లీ సభల్లో నిలిచిపోయాయి. అందుకే సీనియార్టీ ఉన్న వ్యక్తి ఉంటే బావుంటందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటూ పొడిగించింది. ఈ మేరకు బుధవారం సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం (ఏప్రిల్ 30)తో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ఆయన సేవలు ఇంకా అవసరం ఉందని భావించిన ప్రభుత్వం.. ఏడాది పాటూ సర్వీసును పొడిగించింది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.


ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శాసనమండలి రద్దు, కీలక బిల్లులు అసెంబ్లీ సభల్లో నిలిచిపోయాయి. అందుకే సీనియార్టీ ఉన్న వ్యక్తి అసెంబ్లీ కార్యదర్శిగా ఉంటే బావుంటందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపారు. అయితే, అది నిబంధనలకు విరుద్ధం అంటూ సెలక్ట్ కమిటీ ఏర్పాటుకి అసెంబ్లీ కార్యదర్శి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై అధికార-ప్రతిపక్షాల మధ్య యుద్ధం నడుస్తోంది. ఇటు అసెంబ్లీలో శానసమండలి రద్దుకు చేసిన తీర్మానం కూడా కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉంది.