జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టు షాక్.. ఆ జీవో రద్దు, ఈ నెల 28లోగా!

ప్రభుత్వం ఇచ్చిన జీవో 623ను రద్దు చేసింది. ఈ జీవో ఎందుకిచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 28లోపు వివరణ ఇవ్వాలని సీఎస్, పంచాయతీరాజ్‌శాఖ, ఈసీని హైకోర్టు ఆదేశించింది.


ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాలకు రంగులపై ప్రభుత్వం ఇచ్చిన జీవో 623ను రద్దు చేసింది. ఈ జీవో ఎందుకిచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 28లోపు వివరణ ఇవ్వాలని సీఎస్, పంచాయతీరాజ్‌శాఖ, ఈసీని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కరణ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించిన కోర్టు.. ఈ నెల 28లోపు రంగులు తీసేయాలి లేదా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.


పంచాయతీ కార్యాలయాలకు గతంలో వేసిన రంగులపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వంఎర్రమట్టి, ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులు వేసేలా ప్రభుత్వం ఏప్రిల్‌ 23న జీవో 623ను జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ వేసిన పిటిషనన్‌ను విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఈ నెల 19 వరకు జీవోను సస్పెండ్‌ చేసింది. బుధవారం మరోమారు విచారణ జరిగింది. దీనిపై ప్రభుత్వం పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత ఈ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ ప్రభుత్వ తీరుపై మండిపడింది.