ఎల్జీ పాలిమర్స్ నుంచి సైరెన్ మోనోమర్ వాయువు లీకై తీవ్ర అస్వస్థతకు గురైన క్షతగాత్రులను, పిల్లలను స్థానిక కేజీహెచ్లో గల రాజేంద్రప్రసాద్ వార్డులో చికిత్స పొందుతున్న వారిని విశ్వాస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు బి పద్మావతి పరామర్శించి వారి లో ఆత్మస్థైర్యాన్ని నింపారు . దీనిలో భాగంగా పిల్లలకు గ్లూకోజ్ వాటర్ , బిస్కెట్ ప్యాకెట్ లను అందజేశారు.ఘటన జరిగిన సమయం నుండి కేవలం 72 గంటల్లోనే పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చిన అధికార యంత్రాంగాన్ని , రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి , మంత్రుల బృందం ధర్మాన కృష్ణదాస్, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని లు తీసుకున్న చర్యలు ఎంతో స్లాఘనీయమని ఆమె అన్నారు. ఓవైపు బాధితుల ఆరోగ్యాన్ని సంరక్షించే చర్యలు తీసుకుంటూనే గ్రామాల్లో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం ముమ్మరం చేశారు. బాధితులకు తామెప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించిన మన ప్రభుత్వ పనితీరే ఇందుకు నిదర్శనమని ఆ 5 గ్రామాల ప్రజలు మనోధైర్యంతో ముందుకెళ్లాలని ఆమె కోరారు.
ఎల్జి పాలిమర్స్ బాధితులకు పరామర్శ.. విశ్వాస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు బి పద్మావతి