శ్రీవారి భక్తులకు అలర్ట్.. దర్శనాలకు ముహూర్తం ఫిక్స్

ఈ నెల 8, 9న ట్రైయిల్ రన్ నిర్వహిస్తామని.. ఈ నెల 10న స్థానిక భక్తులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ నెల 11 నుంచి సాధారణ భక్తుల్ని అనుమతిస్తామన్నారు. 


తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ నెల 11 నుంచి సాధారణ భక్తుల్ని స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెల 8, 9న ట్రైయిల్ రన్ నిర్వహిస్తామని.. ఈ నెల 10న స్థానిక భక్తులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ నెల 11 నుంచి సాధారణ భక్తుల్ని అనుమతిస్తామన్నారు. భక్తులు ఆరు అడుగులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు.


ఆన్‌లైన్‌లో మూడు వేలమంది భక్తులకు అనుమతి ఇస్తామన్నారు సుబ్బారెడ్డి. రోజుకు ఎంతమందిని అనుమతించాలన్న అంశంపై వర్కౌట్ చేస్తున్నామని.. దీనిపై త్వరలో క్లారిటీ ఇస్తామన్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వాళ్లు, 10లోపు పిల్లలు ఆలయాలకు అనుమతించమని చెప్పారు. రెడ్, కంటైన్మెంట్ జోన్స్ నుంచి భక్తులు దర్శనానికి రావొద్దని కోరారు. ఉదయం 6.30 నుంచి సాయంత్రం 7.30 వరకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంటుందని.. రాత్రి సమయంలో కర్ఫ్యూ అమల్లో ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

మరోవైపు వీఐపీలకు ఒక గంట మాత్రమే బ్రేక్ దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి. సాయంత్రం నాలుగు వరకే అలిపిరి నడక మార్గంలో భక్తుల్ని అనుమతిస్తామని.. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల్ని అనుమతించడం లేదన్నారు. ఘాట్‌ రోడ్డులో ఉదయం 5 రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అలిపిరి చెక్‌పోస్ట్ దగ్గర భక్తులు, టీటీడీ సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ ఉంటుందని.. అలాగే ర్యాండమ్ శాంపిల్స్ తీసుకుంటామన్నారు.