విశాఖపట్నం : విద్యారంగంలో విశేష ప్రతిభను కనబరిచే వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సభ్యుల పిల్లలకు ఉ పకార వేతనాలకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఫోరం అధ్యక్షులు, స్కాలర్ షిఫ్ కమిటీ ఛైర్మన్ గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మీడియా మిత్రుల పిల్లల ప్రతిభను ప్రోత్సహిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ప్రతిభకు ప్రోత్సాహం పేరిట జరిగే కార్యక్రమంలో ఉపకార వేతనాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. బుధవారం డాబాగార్డెన్స్ వీజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల “ సమావేశంలో శ్రీనుబాబు మాట్లాడుతూ విద్యారంగంలో ప్రతిభ కనబర్చిన బాలలకు నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను అందించి ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. ఈ స్కాలర్షిప్ కోసం ఎల్.కె.జీ నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు చదివిన విద్యార్థులు 2019-20 విద్యా సంవత్సరంలో అర్ధ సంవత్సరం (ఆఫ్ ఇయర్లీ) మార్కుల జాబితాలను, వీజెఎఫ్ సభ్యత్వ వివరాలను తెలియజేస్తూ జూలై నెలాఖరులోగా డాబాగార్డెన్స్ వీజెఎఫ్ ప్రెస్ క్లబ్ కు దరఖాస్తులను అందజేయాలని కోరారు. కోవిడ్-19 పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఈ ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. స్కాలర్ షిట్ కమిటీలో టి.నానాజీ, పి.ఎన్.మూర్తిలు ఉప ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వీరితో పాటు కమిటీ సభ్యులు కూడా ఉంటారన్నారు. ఇక మీడియా అవార్డుల కమిటీకి ఆరు నాగరాజు పట్నాయక్ ఛైర్మన్‌గా, దాడి రవికుమార్ ఉప ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని పరిస్థితులను బట్టి అవార్డుల ప్రధానం వివరాలను పూర్తి వివరాలతో తెలియజేయడం జరుగుతుందని శ్రీనుబాబు పేర్కొన్నారు. వీజెఎఫ్ కార్యదర్శి ఎస్.దుర్గారావు మాట్లాడుతూ స్టేట్, సీబీఎస్ఇ రెండు విభాగాల్లోనూ స్కాలర్ షిన్లు ఎప్పటిలాగానే అందజేస్తామన్నారు. కోవిడ్-19 పరిస్థితుల నేపధ్యంలో జూలో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ లో నిర్వహించనున్నట్లు చెప్పారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు అయితే ఆగస్టు నెలాఖరులోనే స్కాలర్ షిన్లను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీజెఎఫ్ ఉపాధ్యక్షులు, మీడియా అవార్డుల కమిటీ ఛైర్మన్ ఆర్.నాగరాజు పట్నాయక్, మరో ఉపాధ్యక్షలు టి.నానాజీ, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కోశాధికారి పిఎన్.మూర్తి, కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరరావు, పి.వరలక్ష్మి, ఎమ్ఎస్ఆర్ ప్రసాద్, దొండా గిరిబాబు, పి.దివాకర్ రావు, మాధవరావు, డేవిడ్, గయాజ్, శేఖర్ మంత్రి తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభకు ప్రోత్సాహంకు ధరఖాస్తుల ఆహ్వానం - జూలై నెలాఖరుగా మార్కుల జాబితాలు అందజేయాలి
• BETHA SRINIVASA RAO