విశాఖపట్నం, జూన్ 24: ప్రజా రవాణా శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరానికి పూర్తి స్థాయిలో పని చేస్తామని వైస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎ.వి.వి.సత్యనారాయణ, జి.పి.రావు లు ఒక ప్రకటన తెలిపారు. గతంలో అక్రమాలకు పాల్పడినట్టు వ్యక్తిగత ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు వి.రవికుమార్ పై తేదీ 17-06-2020 న విజయవాడలో జరిగిన అత్యవసర రాష్ట్ర కమిటీ సమావేశంలో రవికుమార్ ను కమిటీ ఏకగ్రీవంగా సస్పెండ్ చేసి, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి గా ఉన్న ఆర్. దేవరాజులను అధ్యక్షుడు గాను, కార్యనిర్వాహక అధ్యక్షుడు జయ రావు, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావు లతో పాటు మరో 23 మందిని కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు ఉద్యోగులకు సమస్యలు పై చర్చలు జరపడానికి, పరిష్కరించటానికి ఉన్నతాధికారులు అనుమతి లేఖ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పిటిడి ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. గతంలో అక్రమాలకు పాల్పడ్డారని వ్యక్తిగత ఆరోపణలు ఎదుర్కొంటున్న రవికుమార్ పై వచ్చినవి ఫెడరేషన్ పై రుద్దడం ఎంత వరకు సబాబు అని విజ్ఞత గలా ఇతర సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. లోగడ ప్రధాన కార్మికుల సంఘాలకు చెందిన నాయకులు పై అనేక అక్రమ ఆరోపణలు ఉన్నాయి. వాటిపై కూడా అధికారులు విచారణ జరుపుతారు అని తెలిపారు. వాస్తవాలు బయటికి వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులను పిటిడి లో విలీనం చేయకపోతే మనజీవితాలు అగమ్యగోచరంగా ఉండేదని పేర్కొన్నారు. అందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వనికి ఉద్యోగులు ఋణపడి ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే వైస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఉద్యోగులు ఆదరించి, సభ్యత్వం తీసుకోవాలని వారు కోరారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరానికి కృషి