ఏపీ: నేడే ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. ఈ వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు

ఏపీలో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ సంయుక్తంగా ఇంటర్ మొదట, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నారు.


ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం రద్దు అయినందున ఫస్ట్ ఇయర్ ఫలితాలను సబ్జెక్టుల వారీగా మార్కుల రూపంలో ప్రకటించనున్నారు.

అయితే సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మాత్రం గ్రేడ్లను ప్రకటిస్తారు. విద్యార్ధులు మార్కుల మెమోలను జూన్ 15 నుంచి ఏపీ ఇంటర్ బోర్డు అఫీషియల్ వెబ్‌సైట్‌ https://bie.ap.gov.in/ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇంటర్ ఫలితాలను http://www.manabadi.co.in/ , https://www.manabadi.com/ వంటి వెబ్‌సైట్లలో హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.

అయితే ఏపీలో లాక్ డౌన్ ముందు మార్చి 4 నుంచి మార్చి 23 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.