జర్నలిస్టుల సహకారంతోనే సమాజాభివృద్ధి - వి.జె.ఎఫ్. ప్రెస్ క్లబ్ పున ప్రారంభం - కార్పొరేట్ హంగులతో ఆధునాతన సదుపాయాలు - హెచ్.పి.సి.ఎల్. డి.జి.ఎం. బి.ఎన్. రావు

విశాఖపట్నం : జర్నలిస్టులు నిరంతర శ్రామికులని, వారితోనే సమాజాభివృద్ధి సాధ్యమని హెచ్.పి.సి.ఎల్. డిప్యూటీ జనరల్ మేనేజర్ బి.ఎన్. రావు అన్నారు. కరోనా లాకౌడాన్ సమయంలో అందంగా ఆధునీకరించిన డాబాగార్డెన్స్ వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ (ప్రెస్ క్లబ్)ను శుక్రవారం డి.జి.ఎం. పున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ కార్పొరేట్ హంగులతో అందంగా తీర్చిదిద్దారని వి.జె.ఎఫ్. కార్యవర్గాన్ని అభినందించారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇటువంటి వేదికలు ఎంతైనా అవసరం అన్నారు. హెచ్.పి.సి.ఎల్. ఎ.జి.ఎం. కాళి మాట్లాడుతూ జర్నలిస్టులకు సభ్యుల సంక్షేమ కోసం వి.జె.ఎఫ్. పాలకవర్గం కృషి అభినందనీయమన్నారు.తమ కంపెనీ ఎప్పుడు సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తమ పాలకవర్గం పనిచేస్తుందన్నారు. త్వరలోనే సీతమ్మధార నార్ల వెంకటేశ్వరభవన్ (వి.జె.ఎఫ్. వినోద వేదిక) ఆధునీకరించి సభ్యుల సంక్షేమం కోసం అందుబాటులోకి తీసుకువస్తారమన్నారు. అక్కడ లిఫ్టు సదుపాయం కల్పిస్తామన్నారు. వి.జె.ఎఫ్. కార్యదర్శి ఎస్. దుర్గారావు మాట్లాడుతూ అందరి సహకారంతోనే ఆయా కార్యక్రమాలు విజయవంతం చేయగలుతున్నామన్నారు. క్రీడాపోటీలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామన్నారు. వై.యస్.ఆర్. సిపి నాయకులు రవిశంకర్ మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంలో కీలకంగా వ్యవహారిస్తున్నారు. వారి సేవలు ప్రశంసనీయమన్నారు. వి.జె.ఎఫ్. ఉపాధ్యక్షులు ఆర్. నాగరాజు పట్నాయక్, టి. నానాజీ, కోశాధికారి పి.యన్. మూర్తి, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరరావు, శేఖరమంత్రి, వరలక్ష్మి, దొండా గిరిబాబు, మాధవరావు, డేవిడ్, ఎం.ఎస్.ఆర్. ప్రసాద్, గయాజ్ తదితరులు పాల్గొన్నారు.